14 July, 2026 | 4:55 PM

Breaking News

20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •  

ముందస్తు పరీక్షలతోనే కిడ్నీ క్యాన్సర్‌కు చెక్!

25-04-2026 01:17 AM
  1. లక్షణాలు లేకపోయినా బయటపడిన 8 సెంటీమీటర్ల గడ్డ
  2. అప్రమత్తతతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ 42 ఏళ్ల వ్యక్తి
  3. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వెల్లడి

హైదరాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి) : ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య పరీక్షల పట్ల అప్రమత్తంగా ఉండటం ప్రాణాలను కాపాడుతుందని ఏషియన్ ఇనిసిట్యూట్ ఆఫ్ నె ఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్ యూ) వైద్యులు నిరూపించారు. ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకపోయినప్పటికీ, సాధార ణ హెల్త్ చెకప్‌లో ఓ వ్యక్తికి  కిడ్నీక్యాన్సర్ ను గుర్తించి విజయవంతంగా చికిత్స  చేశా రు.

కేసు వివరాలు: నగరానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు (బీపీ, షుగర్ వంటివి) లేవు. ధూమపానం అలవాటు కూడా లేదు.అయితే, ఇటీవల ఆయన చేయించుకున్న సాధారణ మాస్టర్ హెల్త్ చెకప్‌లో భాగంగా చేసిన అబ్డామినల్ అల్ట్రాసౌండ్ పరీక్షలో ఎడమ కిడ్నీలో సుమా రు 8 సెంటీమీటర్ల మేర పెరిగిన గడ్డ (మాస్) బయటపడింది.  సీటీ స్కాన్ నిర్వహించగా అది కిడ్నీ క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది.

విజయవంతంగా సర్జరీ: ఏఐఎన్‌యూ యూరాలజీ హెచ్‌ఓడీ, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస నారాయ ణం నేతృత్వంలోని బృందం ఆ రోగికి రాడికల్ నెఫ్రెక్టమీ (సర్జరీ ద్వారా కిడ్నీ తొలగింపు) నిర్వహించింది. పరీక్షల్లో అది ‘క్లియర్ సెల్ రీనల్ సెల్ కార్సినోమా’గా తేలింది. ప్రస్తు తం రోగి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

నిశ్శబ్దంగా వచ్చే వ్యాధి: డాక్టర్ శ్రీనివాస నారాయణం మాట్లాడుతూ ‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 4.3 లక్షల కొత్త కిడ్నీ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. విచారకరమైన విషయమేమిటంటే.. 70 నుంచి 80 శాతం కిడ్నీ కణితులు ఎటువంటి లక్షణాలు లేకుండానే పెరుగుతాయి. మూ త్రంలో రక్తం రావడం, నడుము నొప్పి వం టి లక్షణాలు కనిపిస్తే అది వ్యాధి ముదిరిన ట్లు లెక్క. అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం‘ అని వివరించారు.

రిస్క్ ఫ్యాక్టర్స్: ధూమపానం, ఊబకా యం, రక్తపోటు ఉన్నవారికి ముప్పు ఎక్కువ. కొందరిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చు.

చికిత్స: చిన్న గడ్డలను ’పార్షియల్ నెఫ్రెక్టమీ’ ద్వారా కిడ్నీని కాపాడుతూనే తొలగించ వచ్చు. పెద్ద గడ్డలకు మొత్తం కిడ్నీ తొలగించాల్సి ఉంటుంది.

అవగాహన: ఏడాదికి ఒకసారి కనీసం అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవడం వల్ల ఇలాంటి సైలెంట్ కిల్లర్స్ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా స్కానింగ్‌లో ఏవైనా తేడాలు కనిపిస్తే  యూరాల జి స్టులను సంప్రదించాలని ఏఐఎన్‌యూ యా జమాన్యం కోరింది.