20 March, 2026 | 3:47 AM

ఉగాది ఆత్మీయ పురస్కార సత్కారాలు

20-03-2026 12:00 AM
  1. చింతలచెరువు వెంకటాద్రి- సీవీకే రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో..

సామాజిక అవగాహన ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం.

దేవాదాయ శాఖ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాది, సతీష్ కుమార్ 

చర్ల: మార్చి 19, (విజయక్రాంతి):  ఉగాది ఆత్మీయ పురస్కారాల సత్కారం సందర్భంగా  చింతలచెరువు వెంకటాద్రి, సివికే రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో సమాజ హితం కోసం పాటుపడిన మహనీయులను హైకోర్టు న్యాయవాది, దేవాదాయ శాఖ కౌన్సిలర్, సిహెచ్ సతీష్ కుమార్ సన్మానించి సత్కరించారు, అడుగుజాడల్లో నడుస్తూ, నిస్వార్థ సేవ, సమాజ హిత కార్యక్రమాలు పేదలకు సహాయం,

సామాజిక అవగాహన ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించడం మన బాధ్యతని దివంగత  సివికే రావు  వంటి వారి ఆశయాలను అనుసరించి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగలని  దేవాదాయ శాఖ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాది సిహెచ్ సతీష్ కుమార్ పిలుపు నిచ్చారు. ఉగాది సందర్భంగా శైలజ విహార్ లో గురువారం చింతలచెరువు వెంకటాద్రి_ సివికే రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఆనాటి రోజుల్లో మన్యం ప్రాంతానికి సేవలందించిన దివంగత మహనీయుల కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా సత్కరించారు . వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు ఆనాటి పెద్దల క్రమశిక్షణను.. త్యాగాల అడుగుజాడల్లో నడవాలన్నారు . తన తాత చింతలచెరువు వెంకటాద్రి. నాన్న సివికే రావు ఆనాటి రోజుల్లో చేసిన సేవలను గుర్తు చేశారు. 

ట్రస్ట్ నిర్వాహకులు సివి రమణ ప్రసంగించారు. ఈ సందర్భంగా సివికే రావు తనయులు సతీష్ కుమార్, రమణ చేస్తున్న సమాజ హిత కార్యక్రమాలను పలువురు ప్రముఖులు కొనిఆడారు  అనంతరం కొంతమంది సీనియర్ విలేకరులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.  టిపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గ ప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శి, మచ్చ వెంకటేశ్వరరావు, మాజీ డిసిసిబి చైర్మన్ ఎలమంచిలి రవికుమార్, చింతూరు వెంకటరావు ,  బండారు రామకృష్ణ,ఉదయ ప్రభాకర్, కొత్తపల్లి ఆంజనేయులు, దాట్ల కృష్ణంరాజు, తడికల లాలయ్య,  శేశెట్టి సాంబయ్య, పెద్దాడ ఆశాలత, చీమలమర్రి మురళి తదితరులు పాల్గొన్నారు