అద్దె ఎడ్లబండ్లతో ప్రదర్శన
20-03-2026 12:00 AM
రైతుల వద్ద కరువైన ఎడ్లబండ్లు
కామారెడ్డి, మార్చి 19 (విజయక్రాంతి): ఉగాది పర్వదినాన్ని పుర స్కరించుకొని ఎడ్ల బండ్ల ప్రదర్శనలను రైతులు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎడ్ల బండ్లు రైతుల వద్ద కనుమరుగయ్యాయి. దీంతో గురువారం కామారెడ్డి జిల్లాలో ఉగాది పర్వదినం సందర్భంగా ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించేందుకు రైతులు, కుల సంఘాల వారు చెరుకు తరలించే గిరిజన రైతుల ఎడ్లబండ్లను అద్దెకు తీసుకున్నారు. రోజుకు రూ. 5వేలు, రెండు రోజులకు రూ.10 వేల అద్దెకు ఒప్పందం చేసుకుని ఎడ్లబండ్ల ప్రదర్శనలు నిర్వహించారు.




