రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
12-03-2026 10:54 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ(Maripeda) బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గాలివారి గూడెం గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్, బిక్షం అనే యువకులు మహబూబాబాద్ నుండి గాలి వారి గూడెం గ్రామానికి బైక్ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మరణించారు. మరిపెడ ఎస్ ఐ కోటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.




