వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కదు
- శిక్షణ శిబిరంలో స్థానిక నేతలను క్లాస్ పీకిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని శాసనసభ బిజెపి ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మాహ అభియాన్ శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై భారీ అప్పుల భారం మోపుతున్నారని విమర్శించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగే తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కదని సవాల్ చేశారు. ఈ శిక్షణ కార్యక్రమ నిర్వహణ లోపాలపై స్థానిక నేతలను క్లాస్ వీక్నట్లు తెలిసింది. పార్టీ పూర్తిస్థాయిలో గ్రామీణ ప్రాంతానికి చేరేలా తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ జిల్లా కమిటీ కిందిస్థాయి పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






