calender_icon.png 11 February, 2026 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

11-02-2026 12:00:00 AM

30 తులాల వెండి ఆభరణాలు రికవరీ

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి):ఈసందర్భంగా సి.ఐ మాట్లాడుతూ. బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామానికి చెందిన కొంకటి తిరుపతి ఇంట్లో తేదీ 07.02.2026 తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి వెండి పూజా వస్తువులను దొంగిలించగా కొంకటి తిరుపతి బోయినపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా ఎస్.ఐ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో సాక్ష్యాల ఆధారంగా నిందుతులు సిద్దిపేట జిల్లా,

చేర్యాల మండలం,ముస్త్యాల గ్రామనికి చెందిన కంచు శివ శంకర్ మరియు సంజీవయ్య నగర్, సిరిసిల్ల, ప్రస్తుతం వేములవాడ సుబాష్నగర్ చెందినసామ ల్ల బాలకిషన్ గా గుర్తించడం జరిగిందని, వీరిని పట్టుకువడానికి బోయినపల్లి ఎస్.ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా సాంకేతికత ఆధారంగా నిందుతులను  కోదురుపాక చౌరస్తా వద్ద బస్సు కోసం వేచి ఉండగా అదుపులోకి తీసుకొని వారి వద్ద 30 తులాల వెండి ఆభరణాలు, స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడాం జరిగిందన్నారు.

త్వరితగతిన కేసు చేధించిన ఎస్.ఐ రమాకాంత్, ప్రింగర్ ప్రింట్ ఎస్.ఐ క్రాంతి, సిబ్బంది కోటి, లక్ష్మీనారాయణ, సుధాకర్, వెంకటేష్ లను వేములవాడ రూరల్ సి.ఐ ప్రత్యేకంగా అభినందించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,గ్రామాలలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.