10 June, 2026 | 2:24 PM

Breaking News

సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •   కల్వకుర్తి నియోజకవర్గానికి ‘ఫ్యూచర్ సిటీ’తో బంగారు భవిష్యత్తు   •  

రాష్ట్రస్థాయిలో ఇద్దరు విద్యార్థులకు బంగారు పతకాలు

19-01-2026 12:00 AM

జనగామ గ్రామానికి గర్వకారణం

కామారెడ్డి, జనవరి 18 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా, బీబీపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన విద్యార్థులు డాకురు నిక్షిత, కుమ్మరి ధనుష్ కుమార్ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ కరాటే  సెలక్షన్స్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారు.

ఈ విజయంతో వారు వచ్చే ఏప్రిల్‌లో ముంబై లో జరగనున్న నేషనల్ లెవెల్ పోటీలకు ఎంపికయ్యారని గ్రాండ్ మాస్టర్ కామిండ్ల  రాజయ్య తెలిపారు. విద్యార్థుల ఈ ఘన విజయంలో కోచ్లు కేకే స్వామి, కోచ్ చింటూ వారి శిక్షణ కీలకంగా నిలిచిందని పేర్కొన్నా రు. జనగామ గ్రామం పేరు రాష్ట్రస్థాయిలో వెలుగొందేలా చేసిన విద్యార్థులను గ్రామస్తులు, క్రీడాభిమానులు అభినందించారు.