11 May, 2026 | 11:15 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

హత్యాయత్నం కేసులో ఇద్దరి రిమాండ్

03-03-2026 12:25 AM

ఘట్ కేసర్, మార్చి 2 (విజయక్రాంతి) : ఓ హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితుల్ని ఘట్కేసర్ పోలీసులు సోమవారం రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల ఘనపురంలో దంతం రాజేష్ నేరస్తుడైన తన్నేరు మణి తేజ చిన్నతనంలో పీర్జాదిగూడలో ఇరుగుపొరుగున నివసించేవారు. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన స్నేహం కారణంగా, 2021లో రాజేష్ స్థాపించిన ’ఫాస్ట్ అండ్ ఫ్రెష్’ లాండ్రీ వ్యాపారంలో మణితేజ్ భాగస్వామిగా చేరాడు.

సద్దుపల్లి వద్ద నడుస్తున్న వ్యాపారంలో గత రెండేళ్లుగా వ్యాపారం నష్టాల్లోకి వెళ్లడంతో ఇద్దరి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దీంతో రాజేష్ మనితేజ్ తో మాట్లాడటం మానేసి, వ్యాపార పనుల కోసం శ్రీనివాస్ అనే వ్యక్తిని సూపర్వైజర్గా నియమించుకున్నాడు. మనితేజ్ తో పాటు ఈశ్వర్ అనే వ్యక్తి రాజేష్ ఇంటికి ఫిబ్రవరి 28న రాత్రి 11:00 గంటలకు రాజేష్ కుక్కలకు మిగిలిపోయిన ఆహారం వేసేందుకు ఇంటి నుండి బయటకు వచ్చాడు.

అప్పటికే ప్రణాళికతో పొదల్లో నక్కి ఉన్న మణితేజ్ ఒక్కసారిగా బయటకు వచ్చి రాజ్పే పెట్రోల్ కవర్ విసిరి, అగ్గిపెట్టెతో నిప్పంటించేందుకు ప్రయత్నించాడు.ప్రాణభయంతో రాజేష్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని నిందితుడి బారి నుండి అతన్ని రక్షించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణలో భాగంగా ఈరోజు ఇద్దరు వ్యక్తులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.