calender_icon.png 4 February, 2026 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేర్వేరు ఘటనలో ఇద్దరు అదృశ్యం

04-02-2026 12:55:54 AM

జవహర్‌నగర్/దమ్మాయిగూడ ఫిబ్రవరి 3(విజయక్రాంతి): ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన కథన ప్రకారం.. దమ్మాయిగూడలోని న్యూ ఇందిరానగర్ దండ్ల లక్ష్మి, భర్త ఎల్లేష్, కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు. లక్ష్మి కుమార్తె శశిరేఖ(20) ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

ఈ నెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్ళిన శశిరేఖ ఇంత వరకు తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకి కోసం చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు కుటుంబసభ్యులు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రైవేటు ఉద్యోగి..

జవహర్‌నగర్‌లోని మాజీ సర్వీస్మెన్ కాలనీలో రూత్ప్రియా, భర్త మరియదాస్ కుటుం బసభ్యులతో కలిసి నివసిస్తున్నారు. మరియదాస్ ప్రైవేటు కంపెనీలు విధులు నిర్వహి స్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మరియదాస్(29) ఆగస్టు 2025లో ఇంట్లో చెప్ప కుండ బయటకు వెళ్ళి ఇంత వరకు తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకి కోసం చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికిన సమా చారం లభించలేదు.

రూత్ప్రియాతో ఫోన్లో మాట్లాడుతుండేవాడు. గత కొంతకాలంగా ఫోన్లో కూడా స్పందనలేకపోవడంతో రూత్రప్రియా అతనిపై అనుమానం వ్యక్తం చేస్తూ జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.