calender_icon.png 4 February, 2026 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతోపాటు క్రీడల్లో రాణించేందుకే సీఎం కప్ పోటీలు

04-02-2026 12:56:46 AM

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డి పట్టణంలో పోటీలను ప్రారంభించారు. సీఎం కఫ్ టోర్నమెంట్లో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు సీఎంకప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్  అన్నారు. ఈ మేరకు సీఎంకప్ నియోజకవర్గస్థాయి క్రీడలను మంగళవారం ఎల్లారెడ్డి జీవదాన్ పాఠశాలలో ప్రారంభించారు. క్రీడాజ్యోతిని ఆవిష్కరించి. విద్యార్థులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు.

సీఎం కఫ్ టోర్నమెంట్లో విద్యార్థులు ప్రతిభను వెలికి తీసేందుకు.. నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి, తాడ్వాయి, సదాశివనగర్, రామారెడ్డి, రాజంపేట మండలాల జట్లు పాల్గొన్నాయని వక్తలు అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ క్రీడలు దోహదపడుతాయని వివరించారు. గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారి ప్రతిభను చాటేలా విద్యార్థులు సీఎంకప్ క్రీడా పోటీలు జరిగాయన్నారు.

క్రీడలు యువతకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధృడత్వాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో, మండల విద్యాధికారి లింగాపురం రాజులు, ఎంపీడీవో తాహీర బేగం ఎల్లారెడ్డి జీవధాన్ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ జోబేష్, ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి, ఎల్లారెడ్డి తాసిల్దార్ ప్రేమ్ కుమార్, ఎల్లారెడ్డి మండలంలోని ఆయా ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు, పాల్గొన్నారు.