26 May, 2026 | 5:30 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

ఫఖర్ జమాన్‌పై 2 మ్యాచ్‌ల నిషేధం

01-04-2026 01:07 AM

లాహోర్, మార్చి 31 : పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆ దేశ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్ మూ ల్యం చెల్లించుకున్నాడు. బాల్ టాంపరింగ్ ఆరోపణలు రుజువు కావడంతో లీగ్ యాజమాన్యం రెండు మ్యాచ్‌ల నిషేధం విధించిం ది. పీఎస్‌ఎల్‌లో భాగంగా లాహోర్ ఖలందర్స్‌కు ఆడుతున్న ఫఖర్ జమాన్ మార్చి 29న  కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డా డని ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయం టీవీ స్క్రీన్లలోనూ స్పష్టంగా కనిపించింది. దగ్గరలోనే ఉన్న ఫీల్డ్ అంపైర్ దీనిని గమనించి బంతిని అడిగి తీసుకుని పరిశీలించా డు. బంతి ట్యాంపరింగ్‌కు గురైనటు అంపై ర్లు నిర్థారించారు. దీంతో బంతిని మార్చడంతో పాటు లాహోర్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీం తో మ్యాచ్ ఫలితమే తారుమారైంది. ఈ నిషేధంతో ఫఖర్ జ మాన్ ఏప్రిల్ 3న ముల్తాన్ సుల్తాన్స్, ఏప్రిల్ 9న ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరుగనున్న మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.