26 May, 2026 | 6:23 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

నా రిటైర్మెంట్ అప్పుడే

01-04-2026 01:08 AM

లక్నో, మార్చి 31 : టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి వార్త ల్లో నిలిచాడు. 2025--26 దేశీవాళీ సీజన్‌లో బెంగాల్ తరఫున ఆడి మహ్మద్ షమీ ఏకం గా 67 వికెట్లు పడగొట్టినప్పటికీ.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ షమీని టీమిండియాలోకి తీసుకోలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత షమీని సెలక్టర్లు పక్కన పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు షమీ తనదైన శైలిలో సమాధానమి చ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవలం వయసును బట్టి కాకుండా తన ఉత్సాహం తగ్గినప్పుడే ఆటకు స్వస్తి పలుకుతానని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి తనకు టైర్మెంట్ ఆలోచనలు లేవన్నాడు. ఒకవేళ ఆ ఆలోచన వచ్చిందంటే..

మనం ఇప్పటికే అలసిపోయినట్టేనని చెప్పుకొచ్చాడు. ఎప్పుడు నిద్రలేచిన తర్వాత క్రికెట్ పట్ల బోర్‌గా ఫీలవుతానో ఆ రోజే వీడ్కోలు ప్రకటిస్తానని షమీ పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ఫిట్‌గా ఉన్నానని, ఆటను ఎంజాయ్ చేస్తున్నానని ఫలితాలు కూడా సానుకూలంగానే ఉన్నాయని షమీ ధీమా వ్యక్తం చేశాడు.