9 April, 2026 | 1:47 PM

సుజాతనగర్ మండలంలో గంజాయి కలకలం.. ఇద్దరు అరెస్ట్

09-04-2026 11:50 AM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో నిషేధిత గంజాయి కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను సుజాతనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం తన సిబ్బందితో కలిసి,కొత్తగూడెం కు చెందిన షేక్ సమద్ యాకుబ్ పాషా,సుజాతనగర్ మండలం డేగలమడుగు గ్రామానికి చెందిన, కదురుబోయిన నరసింహరావు ,అను ఇద్దరు వ్యక్తులు నిషిదిత గంజాయితో  వేపలగడ్డ లో ధన్వoతరి కాలేజ్ పక్కన ఉన్న ఖాళీ స్థలం లో  కలిగి ఉండగా పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుండి  రూ. 7,580/ విలువ గల 151.6 గ్రాముల గంజాయిని, రెండు మొబైల్ ఫోన్లు  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ . వెంకటేశ్వర్లు  కేసు దర్యాప్తు చేసి నిందితులను ఇద్దరిని కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

పట్టుబడిన నిందితుల వివరాలు: 

1) షేక్ సమద్ యాకుబ్ పాషా , డ్రైవర్స్ కాలనీ, చాతకొండ, కొత్తగూడెం

2) కుదురుబోయిన నరసింహారావు , డేగల మడుగు గ్రామం సుజాతనగర్ మండలం

పరారీలో ఉన్న నిందితుని వివరాలు:

1.కిరణ్ దొంగ కిరణ్ , శేషగిరి నగర్,కొత్తగూడెం.