9 April, 2026 | 3:07 PM

జాన్సన్ నాయక్‌ను సన్మానించిన కేటీఆర్

09-04-2026 01:23 PM

ఖానాపూర్, (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య ఝాన్సన్ నాయక్ ను ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించారు. గురువారం రాష్ట్ర రాజధాని లో ఈ కార్యక్రమం జరిగింది .ఇటీవల ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో జాన్సన్ నాయక్ చూపిన పోరాటపటిమ, ప్రజాస్వామ్య పరిరక్షణ తీరును ప్రశంసిస్తూ పార్టీ కోసం తను, తన శ్రేణులను సమయత్తం చేస్తున్న తీరును ఆయన ప్రశంసించారు. ఈ పోరాటపటిమను ఇలాగే కొనసాగించాలని కేటీఆర్ కోరారు.