గోదావరిలో ఈతకు వెళ్లి ఇద్దరి మృతి
11-05-2026 02:01 AM
మహబూబాబాద్, మే 10 (విజయక్రాంతి): గోదావరిలో ఈతకు వెళ్లి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన ములుగు జిల్లాలో కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలో జరిగింది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ బొమ్మరాజు నరేష్ యాదవ్ తన ఇద్దరు అల్లుళ్లతో కలిసి గోదావరిలోకి ఈతకు వెళ్లారు. గోదావరి నదిలో లోతుగా ఉన్న ప్రదేశం వెళ్లడంతో ప్రమాదవశాత్తు అందులో మునిగిపో యారు. ఇందులో సంపత్ యాదవ్ ప్రమా దం నుంచి తప్పించుకొని ఒడ్డుకు చేరుకున్నా డు. బొమ్మరాజు నరేష్, జిట్ట ఈశ్వవర్ధన్ యాదవ్ ఇద్దరు నీట మునిగి చనిపోయారు.






