డిప్యూటీ సీఎంను కలిసిన నూతన అధ్యక్షులు
అభినందనలు తెలిపిన భట్టి విక్రమార్క
మధిర, మే 10(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో మధిర నియోజకవర్గానికి చెందిన నూతన కాంగ్రెస్ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు నూతన అధ్యక్షులుగా నియామకమైన సందర్భంగా వారు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ముదిగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన గుడిపుడి బుచ్చిరామయ్య, మధిర పట్టణ అధ్యక్షుడిగా తలుపుల వెంకటేశ్వర్లు, మధిర మండల అధ్యక్షుడిగా పారుపల్లి విజయ్ కుమార్లు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి వచ్చి భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు వారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
డిప్యూటీ సీఎం నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి, వారికి పలు కీలక సూచనలు చేశారు. “కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, భావజాలానికి కట్టుబడి క్రమశిక్షణతో పని చేయాలి. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలి.” అని సూచించారు. పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై భట్టి విక్రమార్క వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






