13 June, 2026 | 9:15 PM

జూనియర్ అథ్లెటిక్స్ లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు రెండు కాంస్య పతకాలు

13-06-2026 04:24 PM

ముకరంపుర, జూన్ 13(విజయక్రాంతి): తెలంగాణ 12వ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో విశిష్ట ప్రతిభ కనబరిచి ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చిన ఇద్దరు విద్యార్థులను  ఘనంగా అభినందించారు. బి.ఏ. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ. విష్ణువర్ధన్ 20,000 మీటర్ల రేస్‌వాక్ విభాగంలో, దుర్గం మాలుపతి 100 మీటర్ల పరుగుపందెంలో  కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్స్  నితిన్ పాఠక్, టి. రాజయ్య, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. సురేందర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి. అశోక్ మరియు అధ్యాపక బృందం పతక విజేతలను హృదయపూర్వకంగా అభినందించారు.