నిర్మల్ కవికి సన్మానం
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ కు చెందిన సంస్కృత భాషా ప్రచార సమితి ఆదిలాబాదు, నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పద్యకవి, వ్యాఖ్యాత డా బి వెంకట్ హైదరాబాదు రవీంద్రభారతిలో పద్యగాన అనుమానం అందుకున్నారు. రవీంద్రభారతి సమావేశమందిరములో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన "అక్కి నర్సింలు గౌడ్ రచించిన బాలరామాయణం పుస్తకావిష్కరణ సభ, పర్యావరణం కాలుష్య నివారణం అను కవిసమ్మేళనములో పాల్గొని" , తన స్వీయపద్యాలను గానం చేశారు.
ముఖ్య అతిథులు- ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, తెలంగాణభాషా చైతన్య సమితి అధ్యక్షులు బడేసాబ్, కుసుమ ధర్మన్న కళాపీఠం చైర్మన్ రాధాకుసుమ ,పంచపదుల ప్రక్రియ రూపకర్త పాండురంగ విఠల్ చేతులమీదుగా పద్యగాన సన్మానమును స్వీకరించారు. ఈ సందర్భంగా డా.కావేరి ఫౌండేషన్ చైర్మన్ డా.అప్పాల చక్రధారి, తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ళ హన్మంతు, కవియాత్ర జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్, నిర్మల భారతి సాహిత్య సాంస్కృతిక కళా సామాజిక సేవా క్షేత్రం అధ్యక్షులు తోడిశెట్టి పరమేశ్వర్, కవులు- డా దామెర రాములు, డా.ఉప్పు కృష్ణంరాజు తదితరులు వెంకట్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు






