నాగబాబుకు కేబినెట్ హోదా
అమరావతి: 'ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్(Andhra Pradesh Society for Greening), రీఫారెస్టేషన్ ఫర్ ఎకోలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (AP GREEN)' చైర్మన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు నియమితులయ్యారు. నాగబాబు నియామకానికి సంబంధించి రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా(Pawan Kalyan, Deputy Chief Minister) ఉంటూ పర్యావరణ, అటవీ శాఖల బాధ్యతలను కూడా నిర్వహిస్తుండటంతో, ఈ పదవి ఆయన శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ కొత్త పదవితో పాటు నాగబాబుకు క్యాబినెట్ హోదా కల్పించాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
నాగబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి(Andhra Pradesh Legislative Council) సభ్యుడిగా, జనసేన సీనియర్ నాయకుడిగా ఉన్నారు. నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు కావడంతో, ఈ తాజా నియామకం రాజకీయంగా ఆసక్తి నెలకొందివ. నాగబాబు జనసేనలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రి పదవి కోసం కూడా ఆయన పేరు పరిశీలనలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త బాధ్యతతో, నాగబాబు రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలు, పర్యావరణ సంబంధిత కార్యకలాపాలపై దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2047 నాటికి అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచడమే AP-GREEN యొక్క ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.







