ఆహ్వానించలేదని పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు
కోనరావుపేట ఆగష్టు 17 (విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఉద్దేశపూర్వకంగా ఏజెండా పంపకుండా, తనను కార్యక్రమానికి ఆహ్వానించలేదని ఆరోపిస్తూ నిమ్మపల్లి గ్రామపంచాయతీ 2వ వార్డు సభ్యుడు మానుక రాజు పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు చేశారు. మానుక రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తాను నిమ్మపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గంలో 2వ వార్డు సభ్యుడిగా కొనసాగుతున్నానని పేర్కొన్నారు.
శనివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారని, అయితే పంచాయతీ కార్యదర్శి లక్ష్మి తనకు ఉద్దేశపూర్వకంగా కార్యక్రమానికి సంబంధించిన ఏజెండాను పంపలేదని ఆరోపించారు. అంతేకాకుండా వేడుకలకు తనను ఆహ్వానించకపోవడంతో మానసికంగా తీవ్ర క్షోభకు గురయ్యానని రాజు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజాప్రతినిధిగా తనకు సమాచారం ఇవ్వకుండా, కార్యక్రమానికి పిలవకుండా అవమానించిన పంచాయతీ కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.






