13 July, 2026 | 4:30 PM

Breaking News

ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •   రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ   •   ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం   •  

దేవాదుల అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ : మంత్రి ఉత్తమ్

13-07-2026 03:31 PM

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS), ఆ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నాడు దేవాదుల ఎత్తిపోతలను పరిశీలించారు. కాళేశ్వరంపై(Kaleshwaram Lift Irrigation Project) నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టెస్టింగ్ ప్రాసెస్(National Dam Safety Authority Testing Process) పూర్తి కానుందని ఉత్తమ కుమార్ రెడ్డి చెప్పారు. మూడు బ్యారేజ్ లకు మరమ్మతు చేసేందుకు ఐఐటీ బాంబేతో(IIT Bombay) రీడిజైన్ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

వచ్చే వేసవి నాటికి పనులు పూర్తిచేసి, నీటిని నిల్వ చేస్తామని సూచించారు. కన్నెపల్లి నుంచి ఎత్తిపోయడం లేదని ప్రతిపక్షాలు చేసేది దుష్ప్రచారమని మంత్రి ఉత్తమ్ కొట్టిపారేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని అన్నారంలోకి ఎత్తిపోయాల్సి ఉంటుందని వివరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉందని తెలిపారు. కన్నేపల్లి నుంచి అన్నారం, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోయాలని ఉత్తమ్ పేర్కొన్నారు. సాంకేతికంగా కన్నెపల్లి నుంచి నేరుగా ఎల్లంపల్లికి తరలించే అవకాశం లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. మేడిగడ్డ నుంచి కన్నేపల్లి పంప్ హౌస్ 18 కిలో మీటర్ల దూరంలో ఉందన్నారు. మేడిగడ్డ గేట్లు మూసేసి 18 కిలో మీటర్లు వెనక్కి నీటిని పంప్ చేయలేమని వ్యాఖ్యానించారు.

గేట్లు కిందికి దించి నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోతుందని హెచ్చరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల్లో కూడా నాణ్యతాలోపం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) వెల్లడించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్సారెస్పీ, నిజాంసాగర్, శ్రీశైలం చెక్కు చెదరలేదని సూచించారు. బీఆర్ఎస్ హయంలో కట్టిన ఒకే ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని వివరించారు. దేవాదుల అత్యంత ప్రాధన్యత కలిగిన ప్రాజెక్ట్ అన్న మంత్రి ఉత్తమ్ దేవాదుల భూసేకరణ త్వరలోనే పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన నిదులను విడుదల చేస్తాం, వేగవంతంగా దేవాదుల పనులు పూర్తిచేస్తామన్నారు.