బీఆర్‌ఎస్ పార్టీలో ముసలం: మంత్రి అడ్లూరి
21-04-2026 02:54 AM
కరీంనగర్, ఏప్రిల్20(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీలో ముసలం మొదలైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నా రు. బీఆర్‌ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైందని, హరీశ్‌రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటి అని అడ్లూరి ప్రశ్నించారు. జగిత్యాల సభలో కేసీఆర్ కేటీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు..
ఇప్పటికే కుటుంబ సభ్యురాలు కవిత. దూరమైందని అన్నారు.పార్టీని తిట్టాలని పెట్టుకున్న బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ రెండుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ది కూటీల మనస్తత్వ మన్నారు. ఢిల్లీలో హరీశ్‌రావు ఏ పార్టీ నేతలను కలుస్తున్నాడో సమాధానం చెప్పాలని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు.






