క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత
05-05-2026 08:27 PM
గజ్వేల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన రేణుక ఎల్లమ్మను తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వహకుల ఆహ్వానం మేరకు ఎల్లమ్మ కళ్యాణానికి హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆమెకు నూతన వస్త్రాలు బహూకరించారు.






