19 June, 2026 | 10:59 PM

అధికారం పోయిన పిచ్చిలో మతిభ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్

19-06-2026 09:16 PM

కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చిన్నశెట్టి యుగంధర్

దమ్మపేట,(విజయక్రాంతి):  ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై చేసిన వ్యాఖ్యలను దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నశెట్టి యుగంధర్ ఖండించారు. మంత్రి పొంగులేటి పాలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ప్రజాదర్బార్ ద్వారా మంత్రి శ్రీనివాస్ రెడ్డికి వచ్చిన ప్రజాదరణ చూసి తట్టుకోలేకనే కె టి ఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.

గత పదేళ్లల్లో మీరు ఇవ్వని డబుల్ బెడ్ రూమ్ మధ్యలో ఆగిపోయిన ఇళ్లను సైతం రాష్ట్రవ్యాప్తంగా మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు ఇస్తున్నారు.  మునిపెన్నడూ లేనివిధంగా ఇందిరమ్మ ఇళ్లను పట్టణాలు, గ్రామాలు, తండాలు అనే భేదాలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నారన్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులను మంజూరు చేశారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలలో ఒక్కటి కూడా బిఆర్ఎస్ గెలవలేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందనీ అంటున్నారనీ ఒక్కసారి దమ్మపేట మండలం పర్యటిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృధి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం నూటికి నూరు శాతం విజయ వంతం అయ్యిందని,  మహిళలకు ఉచిత బస్సు, రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనే మంజూరు చేస్తున్నారని,  గత పది సంవత్సరాల కాలంలో ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారో, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు.