పెద్దమ్మ దేవి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
19-06-2026 09:13 PM
* బోనాల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
పాపన్నపేట: పెద్దమ్మ దేవి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో సుఖసంతోషాలతో ఉండాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆకాంక్షించారు. శుక్రవారం మండల పరిధిలోని కొడపాకలో పెద్దమ్మ దేవి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం అమ్మ వారికి బోనాల ఊరేగింపు నిర్వహించగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రోహిత్ ను ఘనంగా సత్కరించారు.






