18 July, 2026 | 6:45 PM

Breaking News

పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •  

టీఆర్పీని అధికారంలోకి తేవాలి

01-03-2026 12:20 AM

కార్యకర్తలకు రాష్ట్ర నాయకుల పిలుపు

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా స్థాయి సమావేశం శనివారం నర్సాపూర్ పట్టణంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని నర్సాపూర్ ఇన్‌చార్జ్ మంకిడి రాము లు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశా రు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బసాపురం నాగేష్ ముదిరాజ్, మెదక్ జిల్లా అధ్యక్షుడు ఇమాంపురం యాదగిరి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ హాజరై, నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.

జిల్లా స్థాయి నుండి మండల స్థాయి, మండల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా జిల్లా నాయకత్వం ముం దుండి పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. 2028లో టీఆర్పీ ని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, పార్టీని గ్రామ స్థాయిలో మరింత విస్తరించాలని నాయకులు భీమ వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో మెదక్ జిల్లా సోషల్ మీడి యా ఇంచార్జ్ కమలయ్యగారి సురేష్ ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి శేఖర్ నేత, యూత్ అధ్యక్షులు రవీందర్, యూత్ ఉపాధ్యక్షుడు అనిల్, చేగుంట మండల అధ్యక్షుడు కంచర్ల సిద్దాగౌడ్, సిద్ధక్క, ఠాగూర్, స్వామి, కత్తుల తిరుపతి, పాంపల్లి సురేష్, కౌడిపల్లి అధ్యక్షులు శ్రీను, నిజాంపేట్ నాయకులు సాదిక్, భాస్కర్‌చారి, హ త్నూర మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, హర్ష, సుధీర్, నర్సాపూర్ మండల అధ్యక్షు లు వంశీ యాదవ్ పాల్గొన్నారు.