18 July, 2026 | 7:03 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి

18-07-2026 06:34 PM

పాఠశాల ఏఏపిసి చైర్మన్ ఇంజమూరి శ్రావణి

నేరేడుచర్ల,(విజయక్రాంతి): పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల నందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సమావేశం నిర్వహించిన సందర్బంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాఠశాల ఏఏపిసి చైర్మన్ ఇంజమూరి శ్రావణి మాట్లాడుతూ... తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమన్వయం, విద్యార్థుల హాజరు మెరుగుదల, క్రమశిక్షణ, విద్యాభివృద్ధికి దోహదపడుతుందని పాఠశాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో అధిక సంఖ్యలో విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు.

ఇది ఎంతో హర్షించదగ్గ విషయమని, మెరుగైన నమోదు సాధిస్తున్నందుకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు బట్టు మధు మాట్లాడుతూ విద్యార్థికి కుటుంబమే మొదటి పాఠశాలని తల్లిదండ్రులే తొలి గురువులని తల్లిదండ్రుల సహకారం తోడైతే విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించే వీలుందని ఆ దిశగా తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాఠశాల సమావేశాలకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.