మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం
నూతనకల్: మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త దివంగత మెంచు లింగమల్లు దశదిన కర్మ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి రూ.55,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... మెంచు లింగమల్లు పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన నిబద్ధత కలిగిన కార్యకర్త అని కొనియాడారు.
ఆయన సేవలను స్మరించుకుంటూ, కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మెంచు లింగమల్లు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నాయకులు, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు.






