సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు కృషి
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
తుంగతుర్తి,(విజయక్రాంతి): గౌడ కులస్తులు ఐకమత్యంతో ఉండి, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి, 376 జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన అనగారిన వర్గాల కోసం, స్వాతంత్ర ఉద్యమంలో, పోరాటం చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.
గ్రామాల్లోని గౌడ కులస్తులు ఐకమత్యంతో ఉండి, చిన్న చిన్న తగాదాను పెద్దల సమక్షంలో, పోలీస్ స్టేషన్లో పరిష్కరించుకోవాలని కోరారు. కొట్లాటలకు పోరాదని, గ్రామాల్లోని ప్రజలు శాంతియుతంగా ఉండాలని హితవు పలికారు. అనంతరం తుంగతుర్తి గౌడ సంఘం నూతన కమిటీని ఎస్పీ శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, గౌడ సంఘం మండల అధ్యక్షుడు తునికి సాయిల్ గౌడ్, మాజీ అధ్యక్షుడు గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్, బింగి వెంకటేశ్వర్లు గౌడ్, మల్లయ్య గౌడ్, తొట్ల మణికంఠ గౌడ్, పులుసు వెంకన్న గౌడ్, అంజయ్య గౌడ్, గోపగాని రమేష్ గౌడ్, గుండ గాని రాము గౌడ్, వెంకన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






