అర్థ రాత్రి దారుణ హత్యకు యత్నం
ఎల్లారెడ్డి(విజయక్రాంతి): ఎల్లారెడ్డి డివిజన్ లోని లింగం పేట మండలంలోని ముస్తా పూర్ గ్రామంలో సోమ వారం అర్థ రాత్రి హత్య, యత్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన భర్త అర్ధరాత్రి సమయంలో కూరగాయలు కోసే కత్తితో భార్యపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముస్తాపూర్‌లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పుట్టింటికి వచ్చిన భార్యపై దాడి
పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముస్తాపూర్ గ్రామానికి చెందిన యువతికి షెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన బహుగుణ చారితో వివాహం జరిగింది. గత రెండు మూడు రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఆమె ముస్తాపూర్‌లోని తల్లిగారి ఇంటికి వచ్చింది. భార్యను ఇంటికి తీసుకెళ్లేందుకు సోమవారం ముస్తాపూర్‌కు వచ్చిన భర్త అక్కడే ఉన్నాడు.
అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో భార్యపై దాడి చేసినట్లు సమాచారం. ఆమె శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం భార్య మృతి చెందిందని భావించిన భర్త అక్కడి నుంచి పరారైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సివున్నట్లు పోలీసులు స్థానికులు ఆందోళన చెందుతున్నారు






