18 August, 2026 | 3:10 PM

నర్మెట్టలో విబిజి రామ్ జీ పథకం ఫారం పాండ్ ప్రారంభం

18-08-2026 02:48 PM

సర్పంచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం

జనగామ,(విజయక్రాంతి): విబిజి రామ్ జీ పథకంలో భాగంగా నర్మెట్ట గ్రామంలో మంగళవారం ఫారం పాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో పాతూరి బుచ్చిరెడ్డి భూమిలో ఫారం పాండ్ పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణను పెంపొందించడంతో పాటు రైతులకు సాగునీటి వనరులను అందుబాటులోకి తీసుకురావడంలో ఫారం పాండ్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు తెలిపారు.గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు, ఉపాధి హామీ కూలీలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, టీఏ, ఎఫ్ఏ, మేట్‌లు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.