18 August, 2026 | 3:30 PM

ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్దరించాలి : ఆప్ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్

18-08-2026 02:50 PM

అదనపు ఎస్పీకి వినతిపత్రం అందజేత

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో గల ట్రాఫిక్ సిగ్నల్స్ ను పునరుద్దరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

గతంలో సిగ్నల్స్ పని చేసిన సమయంలోనే పలు ప్రమాదాలు జరిగాయని అలాంటిది సిగ్నల్స్ పని చేయకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. కావున వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ ను పునరుద్దరించడంతో పాటు మళ్లీ అంతరాయము కలగకుండా అత్యాధునిక సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరగా అదనపు ఎస్పీ సానుకూలంగా స్పందించారని అరవింద్ తెలిపారు.