18 August, 2026 | 4:00 PM

ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మార్వో

18-08-2026 03:00 PM

బోధన్,(విజయక్రాంతి): సార్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఓటర్లకు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు బోధన్ మండల ఎమ్మార్వో పట్నం విఠల్ తెలిపారు. సార్ లో నమోదు చేసుకున్న ఓటర్ల పేర్లలో తప్పులు ఉన్నా పేర్లు నమోదు కాకపోయినా ఫారం నంబర్ 6,7,8  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. సంబంధిత బిఎల్ఓలను సంప్రదించి అవసరమైన ఫారాలను అందజేయాలని సూచించారు. దరఖాస్తులకు వచ్చే నెల16వ తేదీ వరకు గడువు ఉందన్నారు.