18 August, 2026 | 3:28 PM

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు సర్దార్ పాపన్న గౌడ్

18-08-2026 02:41 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వే పాపన్న గౌడ్ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న 376 వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్దార్ పాపన్న గౌడ్ ధైర్య సాహసాలు ఆత్మగౌరారం సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

సమాజంలో అన్నగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ వై గిరి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నరసయ్య, గౌడ సంఘాల ప్రతినిధులు నారా గౌడ్, చింతల రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.