3 August, 2026 | 10:33 PM

పట్టు జారితే.. పడిపోవాల్సిందే

03-08-2026 07:37 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలంలో సోమవారం సాయంకాలం కురిసిన వర్షానికి వడగావ్ వాగు పొంగిపోయింది. వాడ్ గావ్ గ్రామపంచాయతీ పరిధిలోని  జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజనులు వ్యవసాయ పనులతో పాటు ఇంద్రవెల్లి వారసంతకు వచ్చి తిరుగు ప్రయాణంలో నిత్యవసర సరుకులు తీసుకు వెళ్తూ వాడ్ గావ్ వాగు దాటవలసిన పరిస్థితి ఏర్పడింది.

వాగు దాటుతూ.. ఒకరి చేతు ఒకటి పట్టుకోవడంతోపాటు కర్రల సాయంతో  వాగు దాటి  జెండా గూడ గ్రామానికి చేరుకున్నారు. వాగు దాటు సమయంలో కర్ర జారిన ఒకరి చేతిలో ఒకరు  చేయి సాయంతో  దాటుసున్నం దాటుతున్న సమయంలో  పట్టు జారితే  వాగులో పడవలసిన పరిస్థితి  ఉన్న చిత్రం ఇది.. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో  పలు మండలాలు ఈ పరిస్థితి  దర్శనిస్తూనే ఉంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని  వాగులపై  కల్వర్టులు  నిర్మించాలని  గిరిజనులు కోరుతున్నారు.