సమాజ సేవలో భాగస్వాములు కావాలి
03-08-2026 09:59 PM
కోదాడ,(విజయక్రాంతి): కుమ్మరి సంఘ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎన్నికైన చలిగంటి రామారావు సమాజ సేవలో భాగస్వాములు కావాలని జెడ్ పి హెచ్ ఎస్ కోదాడ వాకర్స్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు సోమవారం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి మనసున్న వ్యక్తి రామారావు అని కొనియాడారు.. తన సామాజికవర్గతో పాటు అన్ని వర్గాల శ్రేయస్సుకోసం కృషి చేయాలని కోరారు.. ఈ సన్మాన కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు బద్దం భద్రారెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎస్.కె నయీమ్ వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు






