3 August, 2026 | 11:43 PM

వెల్గటూర్ అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు

03-08-2026 09:47 PM

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలు-2, 3లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బండమీది కవిత–గోపి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పుట్టిన గంటలోపు తల్లిపాలు ప్రారంభించడం, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వడం, తల్లిపాల వల్ల తల్లి, శిశువుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ ఎం. విజయ, అంగన్‌వాడీ టీచర్లు బి. మల్లేశ్వరి, జి. శంకరమ్మ, ఆయమ్మ భాగ్యమ్మ, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.