19 May, 2026 | 11:32 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

గిరిజన విద్యార్థులకు విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించాలి

30-11-2025 08:55 PM

భద్రాచలం (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాగఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిరోజు నేర్పించే విద్యతో పాటు వారికి వివిధ కళలు, విజ్ఞానానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించేలా చేసి వారి విద్యాభివృద్ధితో పాటు మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగి జీవితంలో అత్యున్నత స్థానంలో ఉండేలా తీర్చిదిద్దవలసిన బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులపై ఉందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. ఆదివారం సాయంత్రం భద్రాచలం పట్టణంలోని బీఈడీ కళాశాలలో వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు, పిడి, పిఈటిలకు తొమ్మిది రోజులుగా జరుగుతున్న కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ముందుగా 15 రోజులుగా జరుగుతున్న శిక్షణలు తీసుకున్న గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులతో మరియు డీఆర్పీలతో ఆయన ప్రత్యేక సమావేశమైనారు. గిరిజన సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న విద్యాతీరును గిరిజన వ్యవస్థలో విద్యను ఏ విధంగా పాటిష్ఠ పరచాలని పలు అంశాల పైన కులంకషంగా చర్చించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయులకు ఎంతగానో పరిపుష్టిగా వారి యొక్క విద్యాసామర్ధ్యాల నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచుకోవడానికి తరగతి గదిలో చక్కటి నైపుణ్యంతో బోధన చేయుటకు ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే సైన్స్ పట్ల విద్యార్థుల యొక్క వైఖరి మారాలని, గణితం పట్ల భయం పోవాలన్న ఉపాధ్యాయులు తగు శిక్షణ తీసుకున్నట్లయితే విద్యార్థులకు చక్కటి మెలకువలు రావడంతో పాటు వారు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

సైన్స్ ల్యాబ్లు మెరుగుపరచుకోవడానికి వాళ్లకు కావాల్సిన సదుపాయాలు అన్నిటిని సమకూర్చి మెటీరియల్ త్వరలో అందజేస్తానని, అలాగే సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు చక్కటి బోధన చేసినట్లయితే విద్యార్థులు తమ యొక్క కెరియర్లో చక్కటి మార్గాన్ని ఎంచుకోవడం జరుగుతుందని, గ్రూప్ వన్, గ్రూప్ టు తదితర సివిల్స్ వంటిపైన వారు ఆసక్తి చూపి ఉన్నత స్థానాలను అధిరోహించుకోవడానికి వారికి సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుల యొక్క పనితీరు ఎంతో  అవసరం అవుతుందని, విద్యార్థులు ఎప్పటికప్పుడు బట్టి పట్టే విధానాన్ని కాకుండా స్వతాగా ఆలోచించే విధానంతో ఏ విధంగా బోధన చేయొచ్చు అని దానిపైన వారికి మార్గ నిర్దేశం చేస్తూ ఈ శిక్షణ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులలో దాగి ఉన్న బోధన నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఈ శిక్షణాలు ఉపయోగపడతాయని అన్నారు.

గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఎంతవరకు అయినా ఖర్చు చేయడానికి వెనకాడ మని వారి యొక్క ఉన్నత కోసం తాను నిరంతరం వారికి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీరు నాయక్, ఏ సి ఎం ఓ రమేష్, ఎస్ సి ఆర్ పి మోతిలాల్, డిఆర్పీలు మరియు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.