ప్రమాదాలు జరిగితే తప్ప పట్టించుకోరా.?
నడిరోడ్డు పైకి వచ్చిన చెట్ల కొమ్మలు
ప్రయాణికుల గోడు ఇక్కడొచ్చా ఏమైనా పెట్టిన అధికారులు
ప్రమాదాలకు నిలయంగా మారిన మామిడిపల్లి, హన్మాజీపేట రహదారి
వేములవాడ, మే 08 ( విజయక్రాంతి): కోనరావుపేట మండలం మామిడిపల్లి, వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామాల మధ్య ప్రధాన రహదారి ప్రయాణికులకు నరకప్రయాణంగా మారింది, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు విపరీతంగా పెరిగి రోడ్డుపైకి రావడంతో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదురకొంటున్నారు.
ఈ రహదారి ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారిందని బావుసాయిపేట ఉపసర్పంచ్ తిక్కల నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా ఈ గ్రామలలోని చెట్ల కొమ్మల వల్ల దారి కనిపించక పలువురు ప్రమాదాల బారిన పడ్డారని గుర్తుచేశారు. ప్రమాదాలు జరిగితే తప్ప అధికారులు పట్టించుకోరా, నిమ్మకు నీరు తినట్లు వ్యవహరిస్తున్న అధికారులని అన్నారు, అయినా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. మళ్లీ అలాంటి ప్రమాదాలు పునరావృతం కాకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను నరికివేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులకు రహదారి స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టి వాహనదారుల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు.






