17 July, 2026 | 9:09 PM

Breaking News

మైనార్టీ గురుకుల ఉద్యోగులపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ. రూ.5.62 లక్షల ఫైన్   •   రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •  

అవగాహనతో బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స

08-06-2025 12:00 AM
  1. కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘పవర్ ఆఫ్ 3’పేరుతో ప్రచారం 
  2. సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ అరుణ్‌రెడ్డి 

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ముందస్తు అవగాహనతోనే బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చునని హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ అరుణ్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని ఏటా జూన్ 8న నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రజలలో అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన వైద్య చికిత్సలపై అవగాహన కల్పించడం కోసం ప్రముఖ వైద్య సంస్థలలో ఒకటైన కేర్ హాస్పిటల్స్ ‘పవర్ ఆఫ్ 3’ పేరుతో ప్రచారం ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో బ్రెయిన్ ట్యూమర్లపై అవగాహన పెంచ డం, తొందరగా గుర్తించడం, సమయానికి వైద్యం అందించడం కీలకమని చెపుతున్నారు.

హైదరాబాద్‌లోని అన్ని కేర్ హాస్పిట ల్స్ 5జీ టెక్నాలజీతో కూడిన అంబులెన్సు లు అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ‘ది పవర్ ఆఫ్ త్రీ’ ప్రచారంలో భాగంగా కేర్ హాస్పిటల్స్ మూడు ముఖ్యమైన హామీలు ఇస్తోంది. ఎమర్జెన్సీ కాల్స్‌కు 3 రింగ్స్ లోపల స్పందిస్తారు. హైదరాబాద్‌లో ఎక్కడైనా 30 నిమిషాల్లో అంబులెన్స్ రోగిని తీసుకెళ్తుంది.

రోగిని అంబులెన్సులోకి మార్చిన వెంటనే ఎమర్జెన్సీ వైద్యుడు టెక్నీషియన్ సహాయంతో రోగికి అందించా ల్సిన ప్రాథమిక వైద్యాన్ని సూచిస్తారు. ఆసుపత్రుల్లో రోగి రాగానే వెంటనే ఎమర్జెన్సీ వైద్యుడు చికిత్స ప్రారం భిస్తారు. మెదడు ట్యూమర్లు  రెండు రకాలు ఉంటాయి బెనిగ్న్ ప్రైమరీ ట్యూమర్లు, మెలిగ్నెంట్ ప్రైమనీ ట్యూమర్లు.

బెనిగ్న్ ప్రైమరీ ట్యూమ ర్లు  ట్యూమర్లు  కాన్సర్ కారమైనవి కావు. ఇవి మెదడులోని ఇతర భాగాలలోని కణజాలానికి  విస్తరించవు. మెలిగ్నెంట్ ప్రైమరీ ట్యూమర్లు మాత్రం కాన్సర్ గడ్డలు. ఇవి వేగంగా పెరుగుతూ మెదడులోని చుట్టుపక్కల కణజాలంలోకి విస్తరిస్తాయి. 

బ్రెయిన్ ట్యూమర్స్‌కు నమ్మకమైన చికిత్సలు కేర్ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని డాక్టర్ తెలిపారు. సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయించుకుంటే సాధారణ జీవితం గడపవచ్చు డాక్టర్ అరుణ్‌రెడ్డి తెలిపారు.