17 July, 2026 | 8:53 PM

Breaking News

సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •  

మెడికవర్ హాస్పిటల్‌లో అరుదెన సిజేరియన్

08-06-2025 12:00 AM

బ్రెయిన్ ట్యూమర్, హైపోథైరాయిడిజం ఉన్న గర్భిణికి విజయవంతంగా చికిత్స

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్‌లో అరుదైన, అత్యంత ప్రమాదకరమైన న్యూరో- ఆంకాలజీ సందర్భంలో, బ్రెయిన్ ట్యూమర్, హైపోథైరాయి డిజం ఉన్న గర్భిణికి విజయవంతంగా సీజేరియన్ నిర్వహించారు. జన్మించిన శిశువు, తల్లి ఆరోగ్యంగా డిశ్చార్జి అయ్యారు. 27 ఏళ్ల సింధుజా 2015లో మిడ్‌బ్రెయిన్ గ్లియోమా కు రేడియేషన్ చికిత్స పొందారు.

ఈ చికిత్స ను మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అమిత్ కె జోత్వానీ ఆధ్వర్యంలో పొం దారు. ఆమె హైపోథైరాయిడిజం కోసం తర చూ మందులు వాడుతున్నారు.

డాక్టర్ అమి త్ సూచన మేరకు, ఆమె మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను సంప్రదించగా, గైనకాలజిస్ట్ డాక్టర్ వరలక్ష్మి కెఎస్,  న్యూరాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాల నిపుణుల సహకారంతో పూర్తి మల్టీడిసిప్లినరీ మూ ల్యాంకనం జరిగింది. ప్రసవ పురోగతి లేకపోవడంతో జనరల్ అనస్తీషియా అత్యవసర లొయర్ సెగ్మెంట్ సీజేరియన్ సెక్షన్ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యింది.