calender_icon.png 18 February, 2026 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలను మీ కుటుంబంగా భావించండి

17-02-2026 12:00:00 AM

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఫిబ్రవరి 16(విజయక్రాంతి):తాను ఇచ్చిన వాగ్ధానాన్ని త్వరలోనే పూర్తి చేసేలా కృషి చేస్తానని, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలో మెజార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలతో కలిసి ఆయన సంగారెడ్డిలో గెలిచిన కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన వార్డుకు రూ.8 కోట్లు మంజూరు చేయిస్తానని తెలిపారు.

నాలుగు నెలల్లోగా పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తానని, ఓడిన అభ్యర్థులు ఆ వార్డులకు అనధికార కౌన్సిలర్లేనని స్పష్టం చేశారు. రెండు మున్సిపాలిటీల విజయంలో కీలక పాత్ర పోషించిన నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభు గౌడ్, బొంగుల రవి, షఫీ హఫీజ్ లతో పాటు ఇంచార్జి లుగా వ్యవహరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ప్రతీ స్పెషల్ ఫండ్ కేటాయింపులో ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. మరో రెండు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డిని సంగారెడ్డికి తీసుకువచ్చి, సంగారెడ్డి , సదాశివపేట అభ్యర్థులతో మీటింగ్ పెట్టించి కావాల్సిన నిధులు మంజూరు చేయిస్తానన్నారు.