14 August, 2026 | 10:51 PM

మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు

14-08-2026 09:43 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణ కేంద్రంలో శక్కర్ నగర్ రైల్వే గేట్ నుంచి మోస్రా వెళ్లే బెలాల్ వెళ్లేదారిలో రైల్వే బ్రిడ్జి మరమ్మతుల నిమిత్తం ప్రధాన దారిని మూసివేశారు. దీంతో ప్రయాణికులు పక్కనే ఉన్న ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి పనులు పూర్తయ్యే వరకు ఈ సమస్యలు తప్పవని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని రోడ్డు రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు.