29 April, 2026 | 3:04 PM

Breaking News

చక్రం తిరిగేదెలా .. బతుకు సాగేదెలా..!?

29-04-2026 11:19 AM

పెట్రోల్ డీజిల్ కొరతతో సంక్షోభంలో రవాణా రంగం 

రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్ 

షాద్‌నగర్,(విజయక్రాంతి): పెట్రోల్ డీజిల్ కొరతతో రవాణా రంగం కుదేలుగా మారిందని.. చక్రం తిరగక బతుకు బండి సాగడం లేదని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్ ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజుల వ్యవధిలో లీటర్ డీజిల్ దొరకడం గగనతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక పరిణామాలతో ఇప్పటికే రవాణా రంగం కుదేలయిందని ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా పెట్రోల్ డీజిల్ కొరతతో లారీలు ముందుకు కదలని పరిస్థితి అని పేర్కొన్నారు.

రమణారంగంపై ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లు క్లీనర్లు ఓనర్లు ఇంకా అనేకమంది సంబంధిత ప్రజలు పనులు లేక గాసం లేక లబోదిబోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ సరఫరాలో లోపాలు ఒక ఎత్తైతే షాద్ నగర్ నియోజకవర్గంలో కొన్ని ఆయిల్ కంపెనీ డీలర్లు తమకు ఇష్టం వచ్చిన కంపెనీలకు తమ ఖాతాదారులకు మాత్రమే డీజిల్ సరఫరా చేస్తున్నారని రాత్రి వేళల్లో దొంగచాటుగా డీజిల్ సరఫరా జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు.

బంకుల్లో ఖాతాలో ఉన్న ఆయా కంపెనీలకు సంబంధించిన వాహనాలకు రాత్రివేళలో డీజిల్ సరఫరా గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారని ప్రజలకు డీజిల్ విరివిగా అమ్మడం లేదని సయ్యద్ సాదిక్ ఆరోపించారు. అనేక బంకుల్లో ఈతతంగం నడుస్తుందని దీనిపై అధికారులు దృష్టి సారించాలని చర్యలు తీసుకోవాలని సాధిక్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని లేకపోతే రవాణా రంగం సంక్షోభంలో పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.