3 March, 2026 | 2:47 AM

ప్రజల ముంగిటకే పారదర్శక సేవలు

02-03-2026 01:32 AM
  1. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్
  2. రాజేంద్రనగర్. నార్సింగి. గండిపేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లో కి తరలింపు 
  3. కార్యాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

రాజేంద్రనగర్ మార్చి 1 (విజయ క్రాంతి) : ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ అద్దె భవనాల్లో కాకుండా, ప్రభుత్వానికి చెందిన సొం త భవనాల్లోనే నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల  మేరకు ఆదివారం పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నూతన భవనం లోకి మార్చినట్లు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. రాజేంద్రనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం తో పాటు నార్సింగి - గండిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయలను  బండ్లగూడ జాగీర్ హిమాయత్ సాగర్ లోని పాత ము న్సిపల్ కార్పొరేషన్ భవనంలోకి మార్చడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు .

ఆదివారం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే  రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కేటాయించిన  భవనంలో మూడు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను వేరు వేరు గా ప్రారంభించారు. భారీగా చెల్లిస్తున్న అద్దెల భారాన్ని తగ్గించడం. కార్యాలయానికి వచ్చే ప్రజలకు వెయిటింగ్ హాల్స్, పార్కింగ్ వంటి మెరుగైన సౌకర్యాలు కల్పించడం. ప్రభుత్వ కార్యాలయాల్లోనే పౌర సేవ లకు జవాబుదారీతనం పెరుగుతుందనీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎస్‌ఆర్‌ఓ అరవింద్  రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు  పాల్గొన్నారు.