24 February, 2026 | 8:04 PM

గ్రామ పంచాయతీ ఖర్చులపై పారదర్శకత అవసరం

24-02-2026 05:48 PM

నిర్మల్,(విజయక్రాంతి): పల్లెల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్న నేపథ్యంలో గ్రామ సర్పంచులు వార్డు సభ్యులు పారదర్శకంగా వినియోగించుకోవాలని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్ అన్నారు. మంగళవారం మహిళా ప్రాంగణంలో సర్పంచ్లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం మంజూరు చేసే నిధుల వినియోగం డిజిటల్ చెల్లింపులు రికార్డులు పంచాయతీరాజ్ చట్టం తదితరు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.