24 April, 2026 | 9:22 PM

జనగణనపై శిక్షణ

24-04-2026 08:02 PM

- హయత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు అవగాహన తరగతులు 

ఎల్బీనగర్: జనగణనపై సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లను ప్రభుత్వం నియమించి, వారికి అధికారులు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే తొలి దశ జనగణకు కొరకు వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లగా ప్రభుత్వం నియమించింది. హయత్ నగర్ సర్కిల్ లో ఇండ్లు కేటాయింపు, జనగణన 2027 చేపట్టడానికి 38 మంది సూపర్ వైజర్లు, 235 మంది ఎన్యూమరేటర్లను నియమించారు.

శిక్షణలో భాగంగా  హైకోర్టు కాలనీ, సాహెబ్ నగర్, హయత్ నగర్ వార్డులకు సంబంధించిన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు రెండో బ్యాచ్ శిక్షణ తరగతులు ఈ నెల  23, 24, 25 తేదీల్లో  హయత్ నగర్ లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాల్లో చార్జ్ జనగణన అధికారి, ఇన్ చార్జి డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ దినేశ్ సింగ్, ఇన్ చార్జి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు నర్సింగ్ రావు, వెంకన్న, ఫీల్డ్ ట్రైనర్లు సాయి తరుణ్, కనకయ్య, మల్లికార్జున్, విఘ్నేశ్వరి, లక్ష్మీ దీపక్, శైలజ, టాక్స్ ఇన్స్ స్పెక్టర్లు సుధాకర్, నాగయ్య, ఆయూబ్ ఖాన్, జాహీద్, ఆంజనేయులు, బిల్ కలెక్టర్లు శివరాజ్, విశ్వజిత్ రెడీ, శిరీష యాదవ్, అర్చన, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.