ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
18-07-2026 08:50 AM
చిన్నంబావి: మండల పరిధిలోని వెల్టూరు గ్రామంలో గద్వాల జిల్లా కు చెందిన పరుశురాముడు అనే వ్యక్తి డీసీఎం నంబర్ TS-05-UE -6751 వాహనంలో ఐఎఫ్ఎఫ్ సివో డీఏపీ ఎరువులను గ్రామ రైతులకు అధిక ధరలకు విక్రయిస్తూడన్న సమాచారంతో మండల వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్ సంఘటన స్థలానికి వెళ్లి తనిఖీ చేయగా రైతులు ఎరువులు కొనుగోలు చేసినప్పుడు డీలర్ నుండి బిల్లు కానీ రసీదు ఇవ్వడం లేదని, అదే సమయంలో సంబంధిత రికార్డులు,లైసెన్సు ఏమి లేవని తేలిందన్నారు. సంబంధిత వ్యక్తిపై ఏవో స్థానిక మండల స్టేషన్ లో పిర్యాదు చేయగా మండల ఎస్సై రామన్ గౌడ్ సదురు వ్యక్తిపై కేసు నమోదు చేసి, 50 కేజీల 80 డీఏపీ బస్తాల వాహనాన్ని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.






