ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏఐ, డిజిటల్ లెర్నింగ్‌పై శిక్షణ
ఇబ్రహీంపట్నం, జూన్ 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా-అక్క ప్రోగ్రాంలో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు, విద్యార్థులకు రెండు రోజుల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమాని సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాల మాస్టర్ ట్రైనర్ ప్రొఫెసర్ ఎం. సుభాష్ చందర్ అందించారు. ఏఐ సాధనాలను ఉపయోగించి జీవశాస్త్రం, భౌతికశా స్త్రం, గణితం, ఆంగ్లం వంటి వివిధ సబ్జెక్టుల్లో నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవాలో ఆయన ప్రయోగాత్మకంగా వివరించారు. డి జిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ల వినియోగంపై కూ డా అవగాహన కల్పించారు. ఈ శిక్షణ పొం దిన డిగ్రీ విద్యార్థులు అన్నా-అక్క ప్రోగ్రాం కింద ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏఐ, డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
దీంతో సాంకేతిక పరిజ్ఞానం క్షేత్రస్థాయికి చేరనుంది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రా ధిక అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రాధిక మాట్లాడుతూ.. అన్నా- అక్క ప్రోగ్రాం విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి, వారిని భవిష్యత్ సవాళ్లకు సిద్ధం చేస్తుందని ఆమె తెలిపారు. అలాగే గణిత శాస్త్ర విభాగాధిపతి టి. శ్రీకృష్ణ, అధ్యాపకులు డాక్టర్ వి. వీరారెడ్డి, డాక్టర్ శంకర్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. సురేష్తో పాటు అధ్యాపకులు నరేందర్ రెడ్డి, ఎన్. సురేష్, జి. రవి, రవికుమార్, డాక్టర్ రాకేష్, భవాని, డాక్టర్ ఎస్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.






