23 April, 2026 | 2:33 AM

ఓటర్ మ్యాపింగ్ బీఎల్‌ఓలకు శిక్షణ

23-04-2026 01:05 AM

కడ్తాల్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కొత్త ఓటర్ల జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో, కడ్తాల్ మండల కేంద్రంలో కీలక సమావేశం నిర్వహించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జయశ్రీ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఆఫీసర్లకు (BLO) ఓటర్ మ్యాపింగ్ మరియు జాబితా తయారీ విధానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బీఎల్వోలు తమ పరిధిలోని ప్రతి ఇంటినీ సందర్శించి, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని  మరణించిన వారి వివరాలను వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి, నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని తాసిల్దార్ జయశ్రీ సిబ్బందికి సూచించారు.

నేటి నుండి ప్రతి బీఎల్వో తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ల వారీగా డోర్-టు-డోర్ సర్వే నిర్వహించి, ఓటర్ మ్యాపింగ్ పనులను 18 ఏళ్లు నిండిన వారు ఎవరూ మిగిలిపోకుండా వంద శాతం పూర్తి చేయాలని తహసీల్దార్ ఆదేశించారు. ఓటర్ల జాబితా వెరిఫికేషన్ కోసం మీ ఇంటికి వచ్చే బీఎల్వోలకు ప్రజలందరూ సహకరించి, సరైన వివరాలు అందించి జాబితా రూపకల్పనలో భాగస్వాములు కావాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మండల పరిధిలోని బీఎల్వోలు, రెవెన్యూ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.